English | Telugu

పెళ్లిసందడిని హీరో శ్రీకాంత్ మళ్లీ తీసుకొస్తాడట..!

కొన్ని సినిమాలు ఆ జనరేషన్ వాళ్లు హిట్ చేస్తారు. తరతరాల జనరేషన్లు దాన్ని క్లాసిక్ గా గుర్తుంచుకుంటారు. కానీ మళ్లీ అదే సినిమాను తెరకెక్కిస్తే మాత్రం నిరాశే మిగులుతుంది. క్లాసిక్ సినిమాను తీసుకుని, రీమేక్ చేసి హిట్ కొట్టిన సందర్భాలు సినిమా ఇండస్ట్రీల్లో చాలా తక్కువగా ఉంటాయి. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుంటే, హీరో శ్రీకాంత్, తనను హీరోగా నిలబెట్టిన పెళ్లిసందడి సినిమాను తనయుడు రోషన్ తో తెరకెక్కిద్దామని ప్లాన్ వేస్తున్నాడట. ఇప్పటికే రోషన్ రుద్రమదేవిలో బాలనటుడిగా, త్వరలో రాబోతున్న నిర్మలా కాన్వెంట్ సినిమాలో కుర్ర హీరోగా చేశాడు. నిర్మలా కాన్వెంట్ తర్వాత, ఓ మూడు నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చి, రోషన్ కాస్త పెద్దయ్యాక పెళ్లిసందడిని తెరకెక్కించాలని శ్రీకాంత్ భావిస్తున్నాడట.

కానీ ఇది అంత మంచి నిర్ణయం కాదేమోనని శ్రీకాంత్ సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక క్లాసిక్ సినిమాను మరోసారి తీస్తే, అంచనాల్ని అందుకోవడం మాట పక్కన పెట్టి, తేడా వస్తే ఒరిజినల్ కున్న పేరును కూడా దెబ్బతీసినట్టు అవుతుంది. ఈ మాట శ్రీకాంత్ వరకూ వెళ్లిందట. కానీ తనకు అచ్చొచ్చిన అదే స్టోరీ, ఈ జనరేషన్ కు తగ్గట్టుగా మార్చి, తన కొడుక్కి ఫస్ట్ సినిమా నుంచే హిట్ ఇవ్వాలని తాపత్రయపడుతున్నాడు. ఎలాగూ మూడు నాలుగేళ్ల తర్వాతి మాట కాబట్టి, అప్పటి పరిస్థితుల్లో శ్రీకాంత్ ఏం చేస్తాడనేది చూడాలి మరి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.