English | Telugu

గోపీచంద్ కు శృతి హాసన్ ' ఆక్సిజన్ '..!

సౌఖ్యంలాంటి డిజాస్టర్ తర్వాత గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా ఆక్సిజన్. ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఈ రోజు సాయంత్రం ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ విడుదల చేస్తోంది. యూట్యూబ్, ట్విట్టర్లలో ఒకేసారి శృతి ఈ సినిమాను రిలీజ్ చేయబోతోంది. ఇప్పటికే శ్రీరామనవమి రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాడు గోపీచంద్. ఈ రోజు విడుదల కాబోయే మోషన్ పోస్టర్ ను కూడా వైవిధ్యంగా ఉండేలా డిజైన్ చేశారని సమాచారం. ఇప్పటికే మూడు మెయిన్ షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది ఆక్సిజన్ టీం. జగపతిబాబు సినిమాలో కీలక పాత్ర పోషించడం విశేషం. గతంలో జగపతిబాబు, గోపీ కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఆక్సిజన్ చాలా వైవిధ్యమైన స్టోరీ పాయింట్ అని చెబుతున్నారు మూవీ టీం. గోపీచంద్ సరసన రాశిఖన్నా రొమాన్స్ చేయనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.