English | Telugu

హృతిక్ మాయ‌లో పూజా హెగ్డే?!

ఒక‌లైలా కోసం, ముకుంద సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది పూజా హెగ్డే. ఆ త‌ర‌వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ హృతిక్ రోష‌న్‌తో మొహంజదారో అనే సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మూడో సినిమాకే బాలీవుడ్ చాన్స్ రావ‌డం ప‌ట్ల పూజా ఎగిరి గంతేసింది. త‌న కోసం వ‌చ్చిన కొన్ని ద‌క్షిణాది ఆఫ‌ర్లనూ ప‌క్క‌న పెట్టేసింది. ప్ర‌స్తుతం ముంబై, రాజ‌స్థాన్‌ల‌లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. షూటింగ్ సంద‌ర్బంగా హృతిక్ కి పూజా బాగా ద‌గ్గ‌రైపోయిందట‌. త‌న సీన్లేం లేక‌పోయినా.. హృతిక్ కోసం సెట్స్‌కి వెళ్తోంద‌ని, షూటింగ్ అయ్యాక ఇద్ద‌రూ క‌ల‌సి ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లుకొడుతున్నార‌ని బాలీవుడ్ టాక్‌. భార్య‌కు విడాకులిచ్చిన హృతిక్ ప్ర‌స్తుతం ఒంట‌రిగా ఉంటున్నాడు. పూజా రూపంలో హృతిక్‌కి ఓ తోడు దొరికింద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకొంటున్నాయి. అయితే ఈ పుకార్ల‌పై పూజా ఏమాత్రం స్పందించ‌డం లేదు. మ‌రి వ్య‌వ‌హారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.