English | Telugu

కృష్ణవంశీ.. ఆ త‌ప్పుల‌న్నీ గోవిందా?

గోవిందుడు అంద‌రివాడేలే హిట్టా..? యావ‌రేజా..?

ఏదైతేనేం... ద‌స‌రా సీజ‌న్ చ‌లవ‌తో డ‌బ్బులొస్తున్నాయి. థియేట‌ర్లు, గ‌ళ్లాపెట్టెలు నిండుతున్నాయి. దాంతో భుజాలు గ‌జాలైపోతున్నాయి. సినిమా హిట్టే... అని ఎవ‌రికి వారు తీర్మాణించేసుకొన్నారు. కృష్ణవంశీ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడ‌ని కొంద‌రు, ఎనిమిదో సినిమా గండం నుంచి రామ్‌చ‌ర‌ణ్ గ‌ట్టెక్కాడ‌ని మ‌రికొంద‌రు.. (అన‌గా చిరు ఫ్యాన్స్‌) పండ‌గ చేసుకొంటున్నారు. ఈ ద‌స‌రా సంద‌డంతా రామ్‌చ‌ర‌ణ్ సినిమాదే అని ఫిల్మ్‌న‌గ‌ర్ కూడా భ్రమ‌ల్లో ఉంది. అయితే ఇవ‌న్నీ ప‌క్కన పెడ‌దాం. నిజాలు మాట్లాడుకొందాం. గోవిందుడు గొప్ప సినిమానా?? లేదంటే సినిమాలేం లేక‌పోవ‌డం వ‌ల్ల, ద‌స‌రా సీజ‌న్ కావ‌డం వ‌ల్ల మ‌రో ఆప్షన్ లేక గోవిందుడు చూస్తున్నారా? గోవిందుడుని నిజంగా క్లీన్‌గా కృష్ణవంశీ తీయ‌గ‌లిగాడా? ఈ సినిమాలోని లోపాల్ని క‌ప్పిపెట్టేసే స్టామినా గోవిందుడుకు ఉందా...??

అస‌లు ఈ సినిమా ఓపెనింగ్ షాట్‌.. అందులో చ‌ర‌ణ్ వినిపించే డైలాగులూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ క‌థ‌కు బ‌లం, ప్రాణం ఈ డైలాగే అన్నది చ‌ర‌ణ్ మాట‌. కానీ ఆ డైలాగ్‌లో ప‌ద‌ను లేదు. అస‌లు ఈ క‌థ‌కి సంబంధ‌మే లేదు. మ‌న ప‌ని మ‌న‌మే చేసుకోవాలి, మ‌న ఇల్లు మ‌న‌మే చ‌క్కబెట్టుకోవాలి.. మ‌న బంధాలు మ‌న‌మే క‌లుపుకోవాలి అని మా నాన్నగారు (అంటే ఇక్కడ రెహ‌మాన్ అన్నమాట‌) చెప్పారు... నేనూ అదే ఫాలో అవుతున్నా అంటాడు చ‌ర‌ణ్‌. బంధాల‌కు అంత విలువ ఇచ్చేవాడైతే రెహ‌మాన్ అన్నేళ్లు ఎలా మిన్నకుండిపోయాడు..? త‌న తండ్రిని, త‌ల్లిని గుర్తు చేసుకొంటూ ఇండియా ఎందుకు రాలేదు...? క‌నీసం ఆ ప్రయ‌త్నమైనా ఎందుకు చేయ‌లేదు?

డీన్ పోస్ట్ ఇవ్వలేద‌ని పాతికేళ్ల ఆవేద‌న కొడుకు ముందు బ‌య‌ట‌పెట్టుకొంటాడా? ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి ఇంత‌కంటే బ‌ల‌మైన స‌న్నివేశం త‌ట్టలేదా?

తెలుగులో మాట్లాడాలి, తెలుగు సంప్రదాయాల‌కు విలువ ఇవ్వాలి అంటుటాడు అభిరామ్‌. మ‌రి ఆ పోనీటైల్ ఏంటి? తాను మాత్రం ఇంగ్లీష్‌లో మాట్లాడొచ్చా??

తెలుగు సంప్రదాయాల‌కు విలువ ఇచ్చే కృష్ణవంశీ... ఓ అమ్మాయి, అందులోనూ క‌థానాయిక‌ని తాగిన‌ట్టు చూపించ‌డం ఏమిటి? అస‌లు ఆ పాత్రకు ఔచిత్యం ఉందా..? కాజ‌ల్ మాట్లాడింది త‌క్కువ‌.. చ‌ర‌ణ్‌తో ముద్దులు పెట్టించుకొన్నది ఎక్కువ‌.

* శ్రీ‌కాంత్ పాత్ర అలా ఎందుకు త‌యారైంది..? కార‌ణం చూపించ‌లేదు. అన్నయ్యని ఇంటి నుంచి గెంటేస్తారా?? అందుకే నేనూ వెళ్లిపోతా.. అని చెప్పి, చిన్నప్పుడే ఇంటినుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయి, ఆవారాగా మారినా ఆ పాత్రకు ఓ అర్థం, అందం ఉండేవి..

* గాంధీ ఆసుప‌త్రి 1953లో క‌ట్టిన‌ట్టు చూపించారు. అప్పటికి రెహ‌మాన్ వ‌య‌సు 25 యేళ్లయితే.. ఇప్పటికి క‌నీసం 85 యేళ్లుండాలి. అలాంట‌ప్పుడు ప్రకాష్‌రాజ్ వందేళ్లు దాటేయాలి. చ‌ర‌ణ్‌కి ఇంచుమించు అర‌వై రావాలి. కృష్ణవంశీలాంటి క్రియేటీవ్ ద‌ర్శకుడు క‌నీసం ఇంత చిన్న జాగ్రత్త తీసుకోకపోతే ఎలా?

* విల‌నిజం భ‌యంక‌రంగా చూపిద్దామ‌నుకొని విశ్వప్రయ‌త్నం చేశారిందులో. అదీ పండ‌లేదు. ఆ కోట‌, రావు ర‌మేష్ పాత్రలు చివ‌రికి ఏమైపోయిన‌ట్టు..

* చ‌ర‌ణ్ ఓ అగ్గిపుల్ల వెలిగించ‌డం వ‌ల్ల కోట‌కి కాళ్లొచ్చేశాయ‌ట‌. ల‌క్షలు ఖ‌ర్చు పెట్టినా న‌యం కాని జ‌బ్బు త‌గ్గింద‌ట‌. మ‌రి అంత‌కు ముందు స‌న్నివేశంలోనే కోట.. ప్రకాష్‌రాజ్ ఇంటికి న‌డిచొచ్చిన‌ట్టు చూపించారు..??

* నువ్వు దేవుడివి అనుకొన్నా.. కానీ అంద‌రిలాంటి మామూలు మొగుడివే అంటూ జ‌య‌సుధ ప్రకాష్‌రాజ్‌తో చెప్పే డైలాగ్ ఓ హిందీ సినిమాకి మ‌క్కీకి మ‌క్కీ కాపీ..

* అస‌లు ఈ క‌థలోనే అత్తారింటికి దారేది, సీతారామ‌య్యగారి మ‌న‌వ‌రాలు వాస‌న‌లు కొట్టాయి. దానికి తోడు మురారి, నిన్నే పెళ్లాడ‌తాలోని కృష్ణవంశీ ఫేవ‌రెట్ ఫ్రేములు ద‌ర్శన‌మిచ్చాయి. ఓ హిట్టు ఎలాగైనా కొట్టేయాల‌న్న త‌ప‌న‌తో ఇది వ‌ర‌కు త‌న హిట్ సినిమాల్లో క‌ల‌సి వ‌చ్చిన పాయింట్లన్నీ క‌లిపేసి తీసిన సినిమాలా అనిపించింది.

* ఈ సినిమాకి ప్రధాన మైన‌స్ రామ్‌చ‌ర‌ణ్ అనేది అంద‌రి మాటా. అత‌ని ఫేస్‌లో ఎక్స్‌ప్రెష‌న్స్ ఏమాత్రం ప‌ల‌క‌లేదు. ఇచ్చిన రెండు మూడు ఫీలింగ్స్‌నీ... క్లోజ‌ప్‌లో చూడ‌డం ప్రేక్షకుల‌కు మ‌రింత క‌ష్టంగా మారింది.

* కృష్ణవంశీ సినిమా అంటే పాట‌లు అద్భుతంగా ఉంటాయ‌ని ఫీల‌వుతారు. కానీ ఈ సినిమాలో పాట‌లు విన్నా, చూసినా ఫీలవ్వాలి. అస‌లు ఆ పాట‌ల్లో కృష్ణవంశీ మార్క్ ఏది??

ఇలాంటి స‌వాల‌క్ష మైన‌స్‌లున్న సినిమా ఇది. బ‌హుశా వీటికి స‌మాధానం కృష్ణవంశీ ద‌గ్గర కూడా లేదేమో. సినిమా న‌డుస్తుంది, నాలుగు డ‌బ్బులొస్తున్నాయ్ అనుకొంటే ఎలా..?? ఈ సినిమా 50 యేళ్లు నిలిచిపోతుంది, చరిత్రలో చెప్పుకొనే గొప్ప సినిమా అవుతుంది అన‌డం.. కేవ‌లం ప్రగ‌ల్భాలే అన్నమాట‌.
సో సారీ కృష్ణవంశీ....!

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.