English | Telugu

15న రామ్ చరణ్ 'గోవిందుడు..' ఆడియో

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' కధానాయకునిగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో అగ్రనిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం ప్రస్తుతం లండన్ లోని పలు సుందరమైన ప్రదేశాలలో పాటల చిత్రీకరణ జరుపు కుంటోంది. ఈనెల 15న చిత్రం ఆడియో ను అక్టోబర్ 1 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.


శ్రీకాంత్, కాజల్అగర్వాల్,ప్రకాష్ రాజ్, కమలిని ముఖర్జీ,జయసుధ, ఎం యస్. నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసానిక్రిష్ణమురళి , కాదంబరి కిరణ్, కాశీ విశ్వనాద్,సమీర్, కారుమంచిరఘు, గిరిధర్ , ప్రగతి, సత్య కృష్ణన్ ఇతర ప్రధాన తారాగణం.ఈ చిత్రానికి రచన; పరుచూరి బ్రదర్స్, కెమెరా : సమీర్ రెడ్డి, సంగీతం: యువన్ శంకర్ రాజా, ఆర్ట్: అశోక్ కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హైన్స్,రామ్ లక్ష్మన్, సమర్పణ: శివబాబు బండ్ల, బ్యానర్: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.