English | Telugu
ఢిల్లీ భామకి ఫుల్ డిమాండ్
Updated : Sep 8, 2014
'రకుల్ ప్రీత్ సింగ్' ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకొ౦టుంది. గోపీచంద్ సరసన 'లౌక్యం', రామ్ సరసన 'పండుగ చేస్కో', మంచు మనోజ్ సరసన 'కరెంట్ తీగ', ఆది సరసన 'రఫ్' చిత్రాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరో భారీ ఆఫర్ అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. మాస్ మహరాజా రవితేజ సరసన నటించే అవకాశం రకుల్ కి దక్కిందని తెలుస్తోంది. రవితేజ తో నటిస్తుండడంతో ఈ సారి రకుల్ టాలీవుడ్ పెద్ద హీరోల దృష్టిలో పడుతుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీ ఆఫర్ ను తలచుకుని ఈ బ్యూటీ తెగమురిసిపోతుందట.