English | Telugu

గోవిందుడులో ఓ పాట మిస్సయింది..!

రామ్‌చ‌ర‌ణ్, కృష్ణ‌వంశీ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం గోవిందుడు అంద‌రివాడేలే. ఈ సినిమా అక్టోబ‌రు 1న విడుద‌ల చేస్తున్నారు. పండ‌క్కి ఎట్టిప‌రిస్థితుల్లోనూ సినిమా విడుద‌ల చేయాల‌న్న ల‌క్ష్యంతో హడావుడిగా ఈసినిమాని పూర్తి చేశారు. ఈ కంగారులో గోవిందుడు అంద‌రివాడేలే టీమ్ ఓ పాట‌ను మిస్ చేసుకొంది. ఆడియోలో ఉన్న ఓ గీతాన్ని చిత్రీక‌రించ‌కుండానే ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఆ పాట లేకుండానే సినిమా సెన్సార్ అయిపోయింది. విడుద‌లలోగా ఈపాట పూర్తి చేసి సినిమాకి జోడిద్దామ‌నుకొన్నారు. కానీ ఇప్పుడు వీలుకావ‌డం లేద‌ట‌. ఈ సినిమా ఆ పాట లేకుండానే విడుద‌లైపోతోంది.