English | Telugu

గోపీచంద్ కూడా లిప్ లాక్ లు చేస్తున్నాడు

టాలీవుడ్ లో లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాలలో హీరో, హీరోయిన్లు 'లిప్ లాక్' లతో తెగ రెచ్చిపోతున్నారు. గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటించిన ‘జిల్’ సినిమాలో వీరిద్దరి మధ్య ఘాటుగా ఓ లిప్ లాక్ సీన్ టీజర్ లోదర్శనమిచ్చింది. అయితే ఎప్పుడూ లిప్ లాక్ ల జోలికి వెళ్లని గోపీచంద్ కూడా ఇలా రొమాన్స్ పాఠాలు చెప్పడం ఏంటో అని కొంతమంది అనుకుంటున్నా, జిల్ టీజర్ చూసిన వాళ్లు మాత్రం అదిరిపోయిందని తారీఫ్ ఇస్తున్నారు. వీరి లిప్ లాక్ సీన్ ప్రేక్షకులకు టెంపరేచర్ పెంచుతుందని అప్పుడే అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.