English | Telugu
పవన్ సినిమాతో ఆటాడుకొంటున్నారు
Updated : Jan 8, 2015
పవన్ కల్యాణ్, వెంకటేష్‌ల క్రేజీ మల్టీస్టారర్ సినిమా గోపాల గోపాల విడుదల ఆలస్యమవుతోంది. 9కి రావాల్సిన ఈ చిత్రం 10కి వాయిదా పడింది. ఇప్పుడు 10 కూడా డౌటే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఈ ఆలస్యానికి కారణం ఏమిటి?? డబ్బింగ్ అవ్వలేదా? ఎడిటింగ్ పూర్తవ్వలేదా? లేదా ఆర్, ఆర్ బాకీనా? ఇవేం కాదు. కేవలం సెన్సార్ బోర్డు వల్లే ఈ సినిమా ఆలస్యమవుతోందట. సంక్రాంతి సీజన్ అంటే సినిమాల పండగ. ఈ సీజన్‌లో సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాతలంతా తహతహలాడుతుంటారు. ప్రేక్షకులూ అంతే ఆసక్తిగా కొత్త సినిమాల గురించి ఎదురు చూస్తారు. ఈ సీజన్‌లో సెన్సార్ ముందుకు వెళ్లే సినిమాలు ఎన్నో. అలాంటప్పుడు సెన్సార్ బోర్డు ఎంత అప్రమత్తంగా ఉండాలి..?? కానీ అలా జరగలేదు. సెన్సార్ బోర్డు అధికారి సెలవుల్లో ఉన్నాడు. బుధవారం ఆయన లేకపోవడం వల్లే గోపాల గోపాల సెన్సార్ జరగలేదట. ఆయన మూడు రోజుల నుంచీ సెలవుల్లో ఉన్నాడని, ఆయన ఉంటే బుధవారం గోపాల గోపాల సెన్సార్ పూర్తయిపోయి, 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేద్దునని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. గురువారం కూడా సెన్సార్ బోర్డు అధికారి రాకపోతే.. ఈనెల 11న కూడా గోపాల గోపాల డౌటే.