English | Telugu
పవన్ ఎప్పుడొచ్చేదీ తెలిసింది!
Updated : Jan 2, 2015
పవన్, వెంకీల మల్టీస్టారర్ తుది మెరుగులు దిద్దుకొంటోంది. విడుదలకు రెడీ అవుతున్న కొద్దీ.. ఈసినిమా గురించిన ఆసక్తి కరమైన విషయాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ ఎప్పుడు వస్తాడు? ఎంత సేపు కనిస్తాడు? అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఓ క్లూ దొరికింది. గోపాల గోపాల లో పవన్ రాకతో విశ్రాంతి కార్డు పడుతుందట. వెంకటేష్ ని పవన్ కాపాడే సన్నివేశంతో గోపాల గోపాల ఫస్ట్ ఆఫ్ పూర్తవుతుంది. సెకండాఫ్ మొత్తం పవన్ చుట్టూనే కధ తిరుగుతుందట. పవన్, వెంకీలపై ఓ గీతం కూడా సెకండాప్‌లో చూపిస్తారట. ఏ సినిమాకైనా ద్వితియార్థం కీలకం. ఈ సినిమాలో పవన్‌తో సెకండాప్ దిగ్విజంగా నడిపించి అభిమానుల్ని అలరించబోతోంది చిత్రబృందం. ఓ మైగాడ్‌లో మంచి డైలాగులన్నీ పరేష్ రావల్ చేతే పలికించారు. అయితే ఈసినిమాలో పవన్ కి అధికభాగం అప్పగించారట. పవన్ చెప్పే ఒకొక్క డైలాగ్... అభిమానులతో కేరింతలు కొట్టించేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.