English | Telugu
గోపాలుడు అదరగొట్టాడు
Updated : Dec 17, 2014
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ” గోపాల గోపాల”. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకొనేందుకు అభిమానులు ఆసక్తిని కనపబరుస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజైన ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెంకటేష్ ఆపదలో వున్నప్పుడు పవన్ కళ్యాణ్ బైక్ వచ్చి కాపాడే సన్నీవేశం ఇది. ఈ సన్నీవేశంలోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలిసింది. ఈ పోస్టర్ తో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అవుతున్నాయి. డిసెంబర్ 28న గోపాల గోపాల మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉండొచ్చని టాక్. అయితే ఈ చిత్రం ఆడియో వేడుక రొటీన్ ఆడియో వేడుకల్లా కాకుండా డిఫరెంటుగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదేరోజున ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు.