English | Telugu
పవన్ ఆయనకి 'ఐలవ్యూ' చెప్పాడు
Updated : Dec 17, 2014
టాలీవుడ్ హీరోలలో పవర్ స్టార్ కి వున్నఫాలోయింగ్ ఏ హీరోకి లేదనే చెప్పాలి. పవన్ ఇండస్ట్రిలో చాలామందితోకలిసి పనిచేసిన, ఆయనకు నచ్చే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో వుంటారు. లేటెస్ట్ గా ఈజాబితాలోమరో వ్యక్తి చేరిపోయాడు. అతనెవరో కాదు. గోపాల గోపాల చిత్రానికి మ్యూజిక్ అందించిన అనూప్. ఈ చిత్రానికి అనూప్ అందించిన సంగీతం పవన్ కు తెగనచ్చేసిందట. వెంటనే అనూప్‌కి ఫోన్ చేసి ''ఐ లవ్ యూ అనూప్.. మళ్లీ మనం కలసి పనిచేద్దాం'' అని మాటిచ్చేశాడట. దాంతో అనూప్ ఫుల్ ఖుషీ అయిపోతున్నాడు. ఈ విషయాన్ని అతనే ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేశాడు. ఇదిలావుంటే 'గబ్బర్ సింగ్ 2' తరువాత పవన్ చేయబోయే సినిమాకు అనూప్ మ్యూజిక్ డైరెక్టరని ఇండస్ట్రిలో పుకార్లు మొదలయ్యాయి.