English | Telugu
రికార్డులపై కన్నేసిన 'గోపాల గోపాల'
Updated : Jan 9, 2015
గోపాలుడి లీలలు చూడ్డానికి ఇంకెంతో సమయం లేదు. ఈలోగా అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. పోస్టర్లు, ప్రచార చిత్రాలు, ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. అప్పుడే బెనిఫిట్ షోల హంగామా మొదలైపోయింది. టికెట్ల కోసం రికమెండేషన్లు.. బ్లాక్ టికెట్లు ఎక్కడ దొరుకుతాయ్ అన్న ఆరాలూ షురూ అయ్యాయి. దాదాపు అన్ని మల్టీప్లెక్స్ ధియేటర్లలోనూ తొలి రెండు రోజుల టికెట్లు బుక్ అయిపోయాయి. శని, ఆదివారాలు టికెట్లు లేవు. సినిమా చూడాలంటే సోమవారం వరకూ ఆగాలి. హైదరాబాద్‌లో దాదాపు 10 థియేటర్లలో బెనిఫిట్ షోలు పడనున్నాయి. ఓవర్సీస్‌లో వంద థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతోంది. తొలి రోజు చిత్రబృందం లక్ష్యం రూ.13 కోట్లు. ఈ అంకెను చేరుకొంటే.. టాలీవుడ్‌లో తొలి రోజు వసూళ్లలో గోపాల గోపాల సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. గబ్బర్‌సింగ్ రికార్డును అత్తారింటికి దారేదితో బ్రేక్ చేసిన పవన్, ఇప్పుడు ఆ రికార్డును గోపాలతో చెరిపివేయడం ఖాయంలా అనిపిస్తోంది. తొలి రోజు 13 కొట్లు వసూలు చేసిన సినిమా ఏదీ లేదిప్పుడు. ఈ హవా ఇలానే కొనసాగితే రికార్డులు కొల్లగొట్టడం ఖాయం.