English | Telugu

ఘంట‌సాల సంగీతం స‌మ‌కూర్చిన తొలి చిత్రం 'మ‌న‌దేశం' కాదు!

లెజెండ‌రీ సింగ‌ర్ ఘంట‌సాల వేంక‌టేశ్వ‌ర‌రావు గొప్ప సంగీత ద‌ర్శ‌కుడ‌నే విష‌య‌మూ తెలిసిందే. సాధార‌ణంగా అంద‌రూ ఆయ‌న సంగీతం స‌మ‌కూర్చిన తొలిచిత్రం, ఎన్టీఆర్ న‌టుడిగా ప‌రిచ‌య‌మైన మ‌న‌దేశం (1949) అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సినిమా కంటే ముందే ఆయ‌న రెండు చిత్రాల్లో పాట‌ల‌కు బాణీలు అందించారు. ఆ సినిమాలు.. 'ల‌క్ష్మ‌మ్మ' (1950), 'బాల‌రాజు' (1948). ల‌క్ష్మ‌మ్మ సినిమాకు తొలిగా ఆయ‌న ప‌నిచేశారు. ఆ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడు బాలాంత్ర‌పు ర‌జ‌నీకాంత‌రావు. అయితే అందులోని రెండు పాట‌ల‌కు ఘంట‌సాల ట్యూన్ క‌ట్టారు. టైటిల్స్‌లో ఆయ‌న పేరును "జి.వి. రావు" అని వేశారు. ఆ సినిమా ఆల‌స్యంగా 1950లో విడుద‌లైంది.

అలాగే అక్కినేని నాగేశ్వ‌ర‌రావును స్టార్‌ను చేసిన 'బాల‌రాజు'లో ఘంట‌సాల మూడు పాట‌ల‌కు స్వ‌రాలు కూర్చారు. దాని సంగీత ద‌ర్శ‌కుడు గాలి పెంచ‌ల న‌ర‌సింహారావు. ఆయ‌న స‌హాయ‌కుడిగా టైటిల్స్‌లో "జి.వి. రావు" పేరును మ‌నం చూడొచ్చు. అంటే మొద‌ట ఘంట‌సాల పేరును టైటిల్స్‌లో అలా వేశార‌న్న మాట‌. 'బాల‌రాజు'లోని "తీయ‌ని వెన్నెల రేయి", "తేలీ చూడుము హాయి", "న‌వోద‌యం" అనే పాట‌ల‌కు ట్యూన్స్ క‌ట్టారు ఘంట‌సాల‌. 'మ‌న‌దేశం'తో ఆయ‌న పూర్తి స్థాయి సంగీత ద‌ర్శ‌కుడిగా మారారు. ఆ సినిమాతో పాటు ఆ వెంట‌నే వ‌చ్చిన 'కీలుగుఱ్ఱం' సినిమా కూడా మ్యూజిక‌ల్‌గా పెద్ద హిట్ట‌వ‌డంతో ఇటు గాయ‌కుడిగానే కాకుండా, అటు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గానూ ఘంట‌సాల గ్రేట్ అనిపించుకున్నారు. అన్న‌ట్లు డిసెంబ‌ర్ 3 ఘంట‌సాల జ‌యంతి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.