English | Telugu

హారిక మ‌నుషుల్ని వాడుకొని గేమ్ ఆడే ర‌కం కాదు!

బిగ్ బాస్ 4లో టాప్ 5లో నిలిచే హౌస్‌మేట్స్‌లో ఒక‌రిగా దేత్త‌డి హారిక వీక్ష‌కుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇటీవ‌ల చాలా స్నేహంగా ఉంటూ వ‌చ్చిన అభిజీత్‌ను ఎలిమినేష‌న్ కోసం నామినేట్ చేసి, అత‌డితో పాటు వీక్ష‌కుల్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయిన‌ప్ప‌టికీ హారిక‌కే త‌న ఓటు అంటున్నాడు అనారోగ్య కార‌ణాల‌తో హౌస్ నుంచి మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన నోయ‌ల్ షాన్‌. 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' షో హోస్ట్ అయిన అత‌ను బిగ్ బాస్ హౌస్‌లోకి రి-ఎంట్రీ ఇస్తాడ‌ని చాలామంది భావించారు కానీ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు.

లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో హారిక‌ను స‌పోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అభిజీత్‌, హారిక‌ల‌ను మెచ్చుకున్నాడు. కెప్టెన్సీకి హారిక ఎనిమిది సార్లు పోటీలో నిలవ‌డం మామూలు విష‌యం కాద‌న్నాడు. మ‌నుషుల్ని వాడుకొని గేమ్ గెల‌వాల‌నుకొనే ర‌కం కాద‌నీ, ఎవ‌డేమై పోయినా నాకేంటి, 50 ల‌క్ష‌లు గెల‌వ‌డం ముఖ్య‌మ‌నుకొనే మ‌నిషి కాద‌నీ అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. హారిక‌కు ల‌వ్ ట్రాకులు, కామెడీ ట్రాకులు లేవ‌ని చెప్పాడు నోయ‌ల్‌. జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్న విధంగానే, బిగ్ బాస్ హౌస్‌లోనూ పోటీత‌త్వంతో ఇక్క‌డి దాకా వ‌చ్చింద‌ని ఆకాశానికెత్తేశాడు. బిగ్ బాస్ విన్న‌ర్‌గా ఇంత‌దాకా అమ్మాయిలు నిల‌వ‌లేద‌నీ, ఈసారైనా హారిక‌ను గెలిపించ‌మ‌నీ వీక్ష‌కుల‌ను అత‌ను కోరాడు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.