English | Telugu

'గీతాంజలి' దర్శకుడికి హార్ట్ ఎటాక్

అంజలి ప్రధాన పాత్త్రలో నటిస్తూ రాజ కిరణ్ డైరెక్టర్ గా పరిచయం అవుతుతున్న చిత్రం 'గీతాంజలి'. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుండగా ఈ సినిమా దర్శుకుడు రాజ కిరణ్ ఈరోజు హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. దీంతో యూనిట్‌సభ్యులు కలవరపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సినీ ప్రముఖులు అడిగి తెలుసుకున్నారు. హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా కనిపించనున్నాడు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం. సమర్పణ కోనా వెంకట్. ఎంవివి సత్యనారాయణ నిర్మాత.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.