English | Telugu

‘గోవిందుడు అందరివాడేలే’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

రామ్ చరణ్ - కృష్ణవంశీ లేటెస్ట్ ఫిల్మ్ గోవిందుడు అందరివాడేలేకి రిలీజ్‌ టైమింగ్‌ బంపర్‌గా కలిసి వచ్చింది. దసరా పండగని ఈ చిత్రం బ్రహ్మాండంగా క్యాష్‌ చేసుకుంది. తొలి వారంలో ముప్పయ్‌ అయిదు కోట్లకి పైగా షేర్‌ రాబట్టిన ఈ చిత్రం ఆల్‌టైమ్‌ ఫస్ట్‌ వీక్‌ షేర్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. రిలీజ్ రోజున యావరేజ్ టాక్ తో స్టార్ట్ అయిన గోవిందుడు.. కు అక్టోబర్ 1 నుండి 6 వరకు వరుస సెలవులు రావడంతో అంచనాలను మించి కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలలో గోవిందుడు ఏరియాల వారీ కలెక్షన్స్..

నైజాం 9. 35 కోట్లు

సీడెడ్ 6. 06

గుంటూరు 2. 76

ఉత్తరాంధ్ర 2. 66

ఈస్ట్ గోదావరి 2. 11

కృష్ణా 1. 86

వెస్ట్ గోదావరి 1.70

నెల్లూరు 1. 20

టోటల్ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ 27. 67 కోట్లు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.