English | Telugu

ప‌దికోట్లు అప్పుతీర్చిన 'గంగ‌'

బెల్లంకొండ సురేష్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడ‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ర‌భ‌స‌, అల్లుడు శీను సినిమాల ప్ర‌భావం.. సురేష్‌పై బాగా ప‌డింది. దాదాపుగా రూ.70 కోట్ల‌కు బాకీలు ప‌డిపోయాడ‌ని, ప్ర‌తి రోజూ ఫైనాన్సియ‌ర్లు బెల్లంకొండ ఆఫీసు చుట్టూ, ఇంటి చుట్టూ తిరుగుతున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వాసుల భోగ‌ట్టా. ఇలాంటి క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో 'గంగ‌' ఆదుకొంది. లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి తెలుగులో బెల్లంకొండ సురేష్ నిర్మాత‌. కేవ‌లం రూ.5 కోట్ల‌తో ఈ సినిమారైట్స్‌ని బెల్లంకొండ కొనుక్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ గంగ రూ.15 కోట్ల వ‌సూలు చేసింద‌ని టాక్‌. అంటే... దాదాపుగా రూ.10 కోట్ల లాభం ఈ దెయ్యం సినిమా ఆర్జించి పెట్టింది. నిజానికి చిన్న సినిమాలే బెల్లంకొండ‌ని కాపాడాయి. ఇది వ‌ర‌కు రెండు కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కించిన బ‌స్ట్ స్టాప్ ఏకంగా రూ.12 కోట్లు వ‌సూలు చేసింది. అక్క‌డ ఓ ప‌ది కోట్ల లాభం మూట‌గ‌ట్టుకొన్నాడు సురేష్‌. ర‌భ‌స‌తో ఎన్టీఆర్‌, అల్లుడు శీనుతో కొడుకు హ్యాండిచ్చినా.. లారెన్స్ మాత్రం ఆదుకొన్నాడు.