English | Telugu

రాజ్‌త‌రుణ్ ప‌త‌నం ప్రారంభ‌మైందా?

వ‌రుస‌గా మూడు విజ‌యాల‌తో దూసుకుపోయాడు రాజ్ త‌రుణ్‌. మూడూ మెగా హిట్లే. చిన్న సినిమాలుగా వ‌చ్చి కోట్లు కొల్ల‌కొట్టాయి. దాంతో రాజ్ త‌రుణ్‌పై ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టి ప‌డింది. మ‌రో రెండేళ్ల వ‌ర‌కూ రాజ్ కాల్షీట్లు ఖాళీ లేవు. అంత బిజీ అయిపోయాడు మ‌రి. అయితే తాజాగా విడుద‌లైన సీత‌మ్మ అందాలు - రామ‌య్య సిత్రాలు మాత్రం గ‌ట్టి షాక్ ఇచ్చింది. తొలి షోకే `రొటీన్ క‌థ‌` అనే ముద్ర వేసేశారు. రాజ్ త‌రుణ్ ఎన‌ర్జీ త‌ప్ప మ‌రేం క‌నిపించ‌లేద‌ని పెద‌వి విరుస్తున్నారు విమ‌ర్శ‌కులు. రాజ్ త‌రుణ్ కూడా అవ‌స‌రానికి మించి ఓవ‌రాక్ష‌న్ చేశాడ‌ని గుస‌గుస‌లాడుకొంటున్నారు. మూడు విజ‌యాల‌తో త‌రుణ్ రేంజ్ పెరిగిన మాట వాస్త‌వం. దాన్ని అలుసుగా తీసుకొని కొంత‌మంది నిర్మాత‌ల ద‌గ్గ‌ర త‌రుణ్ కాల‌ర్ ఎగ‌రేశాడ‌ట‌. సెట్‌కి లేట్ గా వ‌స్తున్నాడ‌ని, ప్ర‌మోష‌న్ల‌కు కోప‌రేట్ చేయ‌డం లేద‌ని రాజ్ త‌రుణ్ పై విమ‌ర్శ‌లున్నాయి. ఒక‌ట్రెండు విజ‌యాలు ప‌డితే అంద‌రూ ఇంతే నేమో. రామ‌య్య సినిమాతో కుర్రాడు దార్లోకి వ‌చ్చేయ‌డం ఖాయం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.