English | Telugu

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఫిలిం ఛాంబర్‌ నూతన అధ్యక్షుడు భరత్‌ భూషణ్‌!

తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భరత్‌ భూషణ్‌ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సమస్యలు, గద్దర్‌ అవార్డ్స్‌ గురించి చర్చించారు.

ఈ సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు భరత్‌ భూషణ్‌ మాట్లాడుతూ ‘ఎంతో బిజీ షెడ్యూల్‌ ఉండి కూడా కలవడానికి అవకాశం ఇచ్చి ముచ్చటించినందుకు సీఎం రేవంత్‌రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీ సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వ సహాయం ఎప్పుడూ ఉంటుందని ఆయన చెప్పడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ‘తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు భరత్‌ భూషణ్‌గారికి అభినందనలు. నా అమెరికా పర్యటన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో మీటింగ్‌ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎలాంటి సపోర్ట్‌ కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం’ అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.