English | Telugu

Squid Game2 : ఓటీటీలోకి స్క్విడ్ గేమ్2 వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

ఓటీటీలో అత్యధిక వీక్షకాధరణ పొందిన సిరీస్ లలో స్క్విడ్ గేమ్ ఒకటి. స్క్విడ్ గేమ్ మొదటి సీజన్ 2021 లో విడుదలైంది‌. ఇది మౌత్ పబ్లిసిటీతోనే అత్యధిక మందిని చేరింది.

ఈ సిరీస్ ఆధ్యాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. అందుకే దీనికి అంత క్రేజ్‌. ఇందులో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో లెవెల్ లో సాగుతుంది. గేమ్ లోకి వెళ్ళిన ఏ ఒక్కరికి ఒకరంటే ముఖ పరిచయం ఉండదు. అందరు పేదవాళ్ళే .. డబ్బుల పైన ఆశతో గేమ్ లోకి అడుగుపెట్టిన వాళ్ళే.. అయితే ఈ గేమ్ లో ఓ పాప బొమ్మ నిలబడి ఉంటుంది. గేమ్ ఆడేప్పుడు ఆటగాళ్లు చిన్నతప్పు చేసిన ఆ బొమ్మ వారిని కాల్చేస్తుంది. ఇక ప్రాణభయంతో ఒక్కొక్కరు ఒక్కో గేమ్ ఆడుతుంటారు. సర్వైవల్ థ్రిల్లర్ అండ్ స్కేరీ సీన్లు, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఈ సిరీస్ ప్రధాన బలంగా నిలిచాయి. అందుకే ఈ సిరీస్ ఐఎమ్డీబీ(IMDB) లో టాప్-5 లో నిలిచింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన 28 రోజుల్లోనే 1.65 బిలియన్ అవర్స్ తో రికార్డు సృష్టించింది. ఆరు ఎమ్మీ అవార్డులని కూడా సొంతం చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ కొరియన్ సిరీస్ కి యమక్రేజ్‌. ఇక దీనికి కొనసాగింపుగా స్క్విడ్ గేమ్ 2( Squid Game2) రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. మొదటి పార్ట్ చూడనివాళ్ళకి సెకెండ్ పార్ట్ అర్థం కాదు. పార్ట్ టూ వచ్చే లోపు మొదటి సీజన్ చూసేయ్యండి.