English | Telugu

21 ఏళ్ళ జ్ఞాపకం.. మెగా ఫ్యాన్స్ ని భయపెడుతున్న ప్రభాస్!

2023 సంక్రాంతికి విడుదలైన 'వాల్తేరు వీరయ్య' సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. మూడేళ్ళ తర్వాత మరోసారి సంక్రాంతి బరిలో దిగుతున్నారు చిరంజీవి. ఆయన అప్ కమింగ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' 2026 పొంగల్ కి విడుదలవుతోంది. సంక్రాంతి సీజన్ కావడం, దానికితోడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండటంతో 'మన శంకర వరప్రసాద్ గారు'పై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం ఖాయమని నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ రూపంలో మెగా ఫ్యాన్స్ కి ఓ షాక్ తగిలింది. (Mana Shankara Varaprasad Garu)

ప్రభాస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ 'ది రాజా సాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ కి మారుతి దర్శకుడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన 'మిరాయ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో.. 'రాజా సాబ్'ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత విశ్వప్రసాద్ అనౌన్స్ చేశారు. దీంతో వచ్చే పొంగల్ కి చిరంజీవి, ప్రభాస్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పేలా లేదు. (The Raja Saab)

నిజానికి 2025 సంక్రాంతికే 'విశ్వంభర'తో చిరంజీవి, 'రాజా సాబ్'తో ప్రభాస్ బాక్సాఫీస్ వార్ కి దిగాల్సి ఉంది. కానీ, ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. 'విశ్వంభర' ఏకంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడగా.. ఇప్పుడు 'రాజా సాబ్' 2026 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పటికే చిరంజీవి వచ్చే సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో కర్చీఫ్ వేసి ఉండటంతో.. వీరి మధ్య ఈ ఏడాది మిస్ అయిన పొంగల్ వార్.. వచ్చే ఏడాది ఉండనుంది.

2004 సంక్రాంతికి 'అంజి'తో చిరంజీవి, 'వర్షం'తో ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర తలపడ్డారు. భారీ అంచనాలతో విడుదలైన 'అంజి' హై బడ్జెట్ కారణంగా కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలితే.. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన 'వర్షం' మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓ రకంగా ప్రభాస్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ లా 'వర్షం' సినిమాని చెప్పుకోవచ్చు. అలా చిరంజీవిపై ప్రభాస్ పైచేయి సాధించారు.

ఇప్పుడు ఏకంగా 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవి, ప్రభాస్ పొంగల్ పోరుకి సై అంటున్నారు. అయితే 'అంజి' సెంటిమెంట్ కారణంగా మెగా ఫ్యాన్స్ లో కొంత ఆందోళన కనిపిస్తోంది. అదే సమయంలో కొందరు మెగా ఫ్యాన్స్ మాత్రం.. అనిల్ రావిపూడి ఉండటంతో ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో రావిపూడికి క్రేజ్ ఎక్కువ. గత సంక్రాంతికి పోటీగా 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' ఉన్నా కూడా.. అనిల్ డైరెక్ట్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని కొందరు మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. చూద్దాం మరి 2026 పొంగల్ ఫైట్ లో ఎవరు పైచేయి సాధిస్తారో.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.