English | Telugu
సమంతను సెర్చ్ చేస్తున్న అభిమానులు
Updated : Aug 4, 2014
’ఏ మాయ చేశావే‘ చిత్రంతో కెరీర్ ప్రారంభంచిన సమంత ఎక్కువగా క్లాస్ గా, బబ్లీగా, పక్కింటి అమ్మాయిలా ఉండే పాత్రలే చేసిన సమంత మాస్ పాత్రలు, గ్లామర్ పాత్రలకి దూరంగా ఉండేది. కానీ ప్రస్తుతం సమంత తన బబ్లీ పాత్రలకి కాస్త బ్రేక్ వేసి మాస్ అండ్ గ్లామరస్ పాత్రలు చేయడానికి ప్రాధాన్యత సెలక్ట్ చేసుకుంది. దీనికి ఉదాహరణగా తాను రీసెంట్ గా నటించిన ‘అల్లుడు శ్రీను’ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో తన కాస్ట్యూమ్స్, పాత్ర ఎక్కువగా మాస్ గా ఉండడమే కారణం. అంతే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘రభస’ చిత్రంతో పాటు సూర్య హీరోగా నటిస్తున్న ‘సికందర్’ చిత్రాల్లో కూడా సమంత మాస్ క్యారెక్టర్స్ లో కనిపించనుందట. ఇప్పటి దాకా తన పక్కింటి అమ్మాయిని చూసినట్లు సమంతను చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు మాత్రం సమంత మాస్ లుక్ ఫోటోల కోసం ఆన్ లైన్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.