English | Telugu
లంచగొండి పోలీస్‌గా ఫాహద్
Updated : May 22, 2021
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందాడు ఫాహద్ ఫాజిల్. కేవలం మాలీవుడ్ కే పరిమితం కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ లోనూ తనదైన ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నాడీ వెర్సటైల్ యాక్టర్. ఇప్పటికే `వేలైక్కారన్`, `సూపర్ డీలక్స్` వంటి తమిళ చిత్రాల్లో నటించిన ఫాహద్.. ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ లో నటిస్తున్న `విక్రమ్`లో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ - ఇండియా మూవీ `పుష్ప`లోనూ బ్యాడీగా దర్శనమివ్వనున్నాడు.
కాగా, `విక్రమ్`లో ఫాహద్ ఫాజిల్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో ఫాహద్.. లంచగొండి పోలీస్ అధికారిగా కనిపిస్తాడట. ఈ పాత్ర సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని టాక్. `ఖైదీ`, `మాస్టర్` చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ రూపొందిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీలో `మక్కల్ సెల్వన్` విజయ్ సేతుపతి మరో కీలక పాత్రలో నటించబోతున్నాడు. దీపావళి కానుకగా `విక్రమ్` రిలీజ్ కానుందని కోలీవుడ్ టాక్.
మరి.. `విక్రమ్` చిత్రంతో ఫాహద్ ఫాజిల్ కి నటుడిగా ఎలాంటి గుర్తింపు దక్కుతుందో చూడాలి.