English | Telugu

ప్రజానటుడికి మనోజ్ ఘాటైన సమాధానం

ప్రజానటుడికి మనోజ్ ఘాటైన సమాధానం ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే అమ్మ క్రియేషన్స్ మరియూ కలర్స్ ఫైవ్ పతాకాలపై, ఆది హీరోగా, దన్సిక హీరోయిన్ గా, వసంతబాలన్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం " ఏకవీర ". డిసెంబర్ 17 వ తేదీ సాయంత్రం, మాదాపూర్ లోని దసపల్లా హోటల్లో ఈ " ఏకవీర " చిత్రం మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి చేతుల మీదుగా, తమిళ యువ హీరో కార్తీ అందుకోగా, సరెగమ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయబడింది.

ఈ సందర్భంగా ఏ విషయాన్నైనా ముక్కుకు సూటిగా మాట్లాడే ఆర్.నారాయణ ముర్తి మాట్లాడుతూ అనంతరం ఆయన ప్రాంతీయ చిత్రాలు డబ్బింగ్ చేస్తే ఫరవాలేదు కానీ, జాతీయ, అంతర్జాతీయ చిత్రాలను తెలుగులోకి అనువాదం చేయ్యొద్దని నిర్మాత బెల్లంకొండ సురేష్ ని సభాముఖంగా కోరారు.

దీనికి వెంటనే స్పందించిన యువ హీరో మంచు మనోజ్ కుమార్ అక్కడే ఉన్న తమిళ హీరో కార్తీక్ తో ఈ మాటలు పట్టించుకోవద్దనీ, మేం కూడా మా చిత్రాలను తమిళ, మళయాళ, మహారాష్త్ర భాషలకు తీసుకువెళ్ళే వెళ్ళే ప్రయత్నం చేస్తామనీ అన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.