English | Telugu

బాలీవుడ్ దర్శకుడిపై పాక్‌లో బూటుతో దాడి..!

భజరంగీ భాయిజాన్ సినిమా ద్వారా ఫేమస్ అయిన బాలీవుడ్ డైరెక్టర్‌ కబీర్ ఖాన్‌కు పాక్‌లోని కరాచీలో చేదు అనుభవం ఎదురైంది. కరాచీ నుంచి లాహోర్ వెళ్లేందుకు ఆయన ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఆయన్ను గుర్తుపట్టిన కొందరు పాకిస్థానీయులు కబీర్‌కు వ్యతిరేకంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్‌లో భారత్ నిఘా సంస్థ 'రా' సాగిస్తున్న గూఢచర్యంపై ఎందుకు సినిమా తీయరని ఆందోళనకారులు నిలదీశారు. ఒక వ్యక్తి ఏకంగా బూటు పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ కబీర్ వెంటపడ్డాడు. పాక్ సైన్యానికి వ్యతిరేకంగా ఇండియా కుట్రలు చేస్తోందని, దీనిని సహించబోమని హెచ్చరించాడు. కబీర్ తీసిన పాంటమ్ సినిమా పాక్‌లో వివాదాస్పదమైంది. ఈ సినిమా విడుదలపై లాహోర్ హైకోర్టు నిషేధం విధించింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.