English | Telugu

దిల్‌రాజు.. రివ్యూ ఏద‌మ్మా?

రివ్యూల్ని అస్స‌లు ప‌ట్టించుకోను.. ప్రేక్ష‌కుల‌కూ రివ్యూలు అక్క‌ర్లేద్దు అన్న‌ది దిల్‌రాజు మాట‌. సినిమా బాగుంటే.. ఏ రివ్యూ ఆ విజ‌యాన్ని ఆప‌లేద‌న్న‌ది ఆయ‌న న‌మ్మే సిద్దాంతం. అందుకే రివ్యూలు చూడ్డ‌ట‌. అయితే త‌న సినిమాల‌కు తానే రివ్యూలు రాసి.. ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తానని మొన్నామ‌ధ్య‌... బిల్డ‌ప్ ఇచ్చాడు. ఇప్పుడు కృష్ణాష్ట‌మి సినిమా వ‌చ్చింది. ప్ర‌తీ రివ్యూ ఏకిప‌డేసింది. ఇంత రొటీన్ క‌థ దిల్‌రాజు బ్యాన‌ర్లోనేరాలేద‌ని ముక్త‌కంఠంతో చెప్పేస్తున్నాయి స‌మీక్ష‌లు. అయితే.. దిల్‌రాజు రివ్యూ ఇంత వ‌ర‌కూ రిలీజ్ కాలేదు. మ‌రి ఆయ‌న‌కు రాసే ఉద్దేశం ఉందో, లేదో? రాస్తే ప్రేక్ష‌కుల అభిప్రాయం తెలుసుకొని రాస్తాన‌న్నాడు.

సినిమా చూసినోళ్లంతా రొటీన్ సినిమా రా బాబూ... అని మొత్తుకొంటుంటే, మ‌రి దిల్‌రాజుకి ఆ మాట‌లు వినిపిస్తాయా? ఈ క‌థ పుట్ట‌డానికి కార‌ణం... దిల్‌రాజు. టీమ్ సెట్ చేసి సునీల్‌ని ఇందులోకి లాక్కొచ్చిందీ ఆయ‌నే. ఎడిట్ రూమ్‌లో రోజుల త‌ర‌బ‌డి కూర్చుని ట్రిమ్ చేసి ఫైన‌ల్ అవుట్ పుట్ ఏమిటో డిసైడ్ చేసిందీ ఆయ‌నే. సినిమా విడుద‌లని వాయిదాలు వేస్తూ జాప్యం చేసిందీ ఆయ‌నే. ఈ సినిమాకి రివ్యూ రాస్తా.. నేనే రేటింగులు ఇచ్చుకొంటా అన్న‌దీ ఆయ‌నే. మ‌రి.. అలాంటి మ‌నిషి ఇప్పుడు ఏమ‌ని స్పందిస్తాడో? త‌ప్పుల బాధ్య‌త అంతా త‌న నెత్తిమీద వేసుకొంటాడా? లేదంటే సినిమా బాగానే ఉంది ప్రేక్ష‌కుల‌కే చూడ‌డం రాదు.. అని నింద ఎదుటివాళ్ల‌పై కి విసిరేస్తాడా? వెయిట్ అండ్ సీ.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.