English | Telugu

కుమ్ముతున్న కుర్ర ఖాకీలు..!!

సరైనోడు టీజర్ రిలీజై సందడి చేస్తోంది. ఈ సినిమాలో బన్నీ ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా చేయడం విశేషం. రోల్ చాలా సీరియస్ గా ఉంటుంది కాబట్టి, మీసాన్ని కూడా పెంచాడు స్టైలిష్ స్టార్. బన్నీకి ఇది సెకండ్ టైం ఆన్ స్క్రీన్ పోలీస్..అసలింతకీ మన మిగిలిన యూత్ స్టార్స్ లో ఎవరెవరు పోలీస్ గెటప్స్ వేశారో, ఎవరెవరు ఇంకా ట్రై చేయలేదో ఓ లుక్కేస్తే పోలా..చలో..

పవన్ కళ్యాణ్

చెప్పేదేముంది. జస్ట్ వన్ వర్డ్...గబ్బర్ సింగ్..కాకపోతే, అంతకు ముందు గుడుంబా శంకర్లో కాసేపు మెరిశాడు. కొమరం పులిలో ఫుల్ గా సినిమా అంతా బ్లాక్ అండ్ బ్లాక్ వేసి, తన డిఫరెంట్ స్టైల్ ను చూపించాడు. ఖాకీని పూర్తి స్థాయిలో వేసింది మాత్రం గబ్బర్ సింగ్ కే. లేటెస్ట్ గా సర్దార్ తో రాబోతున్న పవన్, ఇందులో ఖాకీ చొక్కాతో ఏకంగా లుంగీ వేసుకుని నడిచి రావడం కొసమెరుపు

మహేష్ బాబు

పోకిరి క్లైమాక్స్ లో, మహేష్ ఖాకీ డ్రస్ తో కనబడటమే ట్విస్ట్. సినిమాకు సూపర్ హిట్ మైలేజ్ ఇచ్చిన గెటప్ అది. ఆ తర్వాత దూకుడులో కూడా సేమ్ టైప్ లో క్లైమాక్స్ లో పోలీస్ గెటప్ లో మెరిశాడు. ఆగడులో ఫుల్ లెంగ్త్ పోలీస్ గెటప్ వేసినా, డిఫరెంట్ మ్యానరిజంతో అలరించినా, ఫార్ములా కథే కావడంతో జనాలు రిసీవ్ చేసుకోలేదు. మహేష్ మాత్రం ఎప్పటి లాగే, తన బెస్ట్ ఎఫర్ట్ పెట్టి చేశాడు. పోలీస్ లుక్స్ లో మహేష్ కూడా అదుర్స్..

ప్రభాస్

ఇప్పటి వరకూ పోలీస్ క్యారెక్టర్ చేయలేదు ఈ బాహుబలి. టాలీవుడ్ లో బాడీ అండ్ హైట్ పెర్ ఫెక్ట్ గా ఉన్న ఈ శాల్తీ, ఎప్పుడు ఖాకీలో కనిపిస్తాడా అని జనాలు వెయింటింగ్..

ఎన్టీఆర్

శక్తిలో కాప్ గా యాక్ట్ చేసినా, ఖాకీలో కనబడడు. బాద్ షా లో మాత్రం క్లైమాక్స్ లో పోలీస్ డ్రస్ లో కనిపించి తను ఖాకీ వేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, పోలీస్ గెటప్ లో మాత్రం మెరిసిపోయాడు. ఎన్టీఆర్ పోలీస్ యాక్టింగ్ కి పరాకాష్ట టెంపర్. సినిమా బాగున్నా, అందుల్లో ఎక్కడా కూడా తారక్ ఖాకీ అండ్ ఖాకీలో కనిపించకపోవడం విశేషం.

రామ్ చరణ్

జంజీర్ లో ఫుల్ లెంగ్త్ రోల్ వేసి ఇరగదీశాడు చరణ్. సినిమా పోయినా, చరణ్ పోలీస్ గెటప్ మాత్రం సూపర్ గా సెట్ అయింది..తర్వాత రాబోతున్న తనీ ఒరువన్ రీమేక్ లో కూడా చెర్రీ పోలీసే...

బన్నీ రేసుగుర్రంలో కాసేపు పోలీస్ గెటప్ లో కనిపించి కిల్ బిల్ పాండేతో కలిసి కుమ్మేశాడు. కానీ సరైనోడు టీజర్లో అయితే ఎక్కడా, ఖాకీలో కనబడలేదు. మరి సినిమాలో ఏం చేస్తాడో చూడాలి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.