English | Telugu

గంగ భారం దిల్‌రాజుదే

ఏ సినిమా క‌ష్టాల్లో ఉన్నా... ఆదుకోవ‌డానికి ప్ర‌త్య‌క్షం అయిపోతాడు దిల్‌రాజు. అఫ్‌కోర్స్ ఆయ‌నా త‌న లాభం చూసుకొంటాడ‌నుకోండి. ఏం చేసినా... క‌ష్టాల్లో ఉన్న సినిమాని గ‌ట్టెక్కించేస్తాడు. ఇప్పుడు గంగ బాధ్య‌త దిల్‌రాజుపై ప‌డింది. బెల్లంకొండ సురేష్ అప్పులు.. గంగ‌కు భారంగా ప‌రిణ‌మించాయి. త‌మిళంలో ఈ సినిమా ఇర‌గ‌దీస్తున్నా.. తెలుగులో విడుద‌ల చేసుకొనే ఛాన్స్ ద‌క్క‌డం లేదు. ఇప్పుడు ఈ సినిమాని విడుద‌ల చేసే బాధ్య‌త దిల్‌రాజుకి అప్ప‌గించాడు బెల్లంకొండ సురేష్. బ‌య్య‌ర్లకు, అప్పుల‌వాళ్ల‌కూ ఏదోలా స‌మాధానం చెప్పి, తాను మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించి.. ఈ సినిమాని విడుద‌ల చేద్దామ‌నుకొంటున్నాడు దిల్‌రాజు. వీలైతే మే 1న గంగ‌ని విడుద‌ల చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. మ‌రి ఈలోగా దిల్‌రాజు ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.