English | Telugu

నేపాల్ భూకంపం..టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ మృతి

చిత్ర‌సీమ‌కు ఇది మ‌రో షాకింగ్ న్యూస్‌. వ‌రుస మ‌ర‌ణాల‌తో భీతిల్లుతున్న టాలీవుడ్‌కి మ‌రో చేదు వార్త‌. నేపాల్‌లో సంభ‌వించిన భూకంపంలో యువ కొరియోగ్రాఫ‌ర్, న‌టుడు విజ‌య్ మృతి చెందారు. నేపాల్‌లో వచ్చిన భూకంపంలో వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోయారు. అక్క‌డ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటున్న ఎట‌కారం టీమ్ కూడా ఈ ప్ర‌మాదంలో చిక్కుకొంది. భూకంపం సంభ‌వించిన మ‌రుస‌టి రోజు చిత్ర‌బృంద‌మంతా తిరుగు ప్ర‌యాణ‌మైంది. 27వ తేదీన నేపాల్ లో భూమి మ‌ళ్లీ కంపించింది. ఆ ప్ర‌కంప‌న‌ల‌కు ఎట‌కారం టీమ్ ప్ర‌యాణిస్తున్న కారు బోల్తా ప‌డింద‌ని స‌మాచారం. ఈ ప్ర‌మాదంలో విజ‌య్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడ‌ని, మిగిలిన‌వాళ్లంతా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డార‌ని చిత్ర‌బృందం తెలిపింది. గుంటూరుజిల్లా బాప‌ట్ల‌కు చెందిన విజ‌య్ వ‌య‌సు 25 యేళ్లు మాత్ర‌మే. విజ‌య్ హ‌ఠాన్మ‌ర‌ణం చిత్ర‌బృందాన్ని విప‌రీతంగా క‌ల‌చివేస్తోందిప్పుడు. అత‌ని ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని తెలుగువ‌న్ కోరుకొంటోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.