English | Telugu

‘రుద్రమదేవి' హడావుడి మొదలైంది

గుణశేఖర్ హిస్టారికల్ మూవీ ‘రుద్రమదేవి' సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. గుణశేఖర్ ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ‘రుద్రమదేవి' ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఊపందుకుంది. ఈ సినిమా నైజాం, వైజాగ్ పంపిణి హక్కులను దిల్ రాజు మంచి రేటు ఇచ్చి దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాని ఈ ఏరియాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. రుద్రమదేవికి మిగతా ఏరియాల బిజినెస్ కి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. దీనికి మరో కారణం కూడా వుందట. రీసెంట్ గా రిలీజైన బాహుబలి బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని రెంజులో కలెక్షన్లు కురిపిస్తోంది. అలాగే 3Dగ్రాఫిక్స్ తో రూపొందిన రుద్రమదేవికి మంచి టాక్ వస్తే కలెక్షన్లు ఈజీగా రాబట్టవచ్చని భావిస్తున్నారట. ఎట్టకేలకు సినిమా వర్గాలలో రుద్రమదేవి హడావుడి మొదలైంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.