English | Telugu

బాయ్‌ఫ్రెండ్ తో దియా ఎంగేజ్‌మెంట్

బాలీవుడ్ హీరోయిన్ దియామీర్జా తన బాయ్ ఫ్రెండ్, వ్యాపార భాగస్వామి అయిన సాహిల్ సంగాతో నిశ్చితార్థం చేసుకుంది. మూడేళ్ల కిందట తన బాయ్‌ఫ్రెండ్ సాహిల్ సంగాతో కలిసి బోర్న్ ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. అయితే ఇటీవలే ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన దియామీర్జా అక్కడే స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని దియా స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వీరి ఎంగేజ్‌మెంట్ అయిన ఫొటోను కూడా పోస్ట్ చేసింది. త్వరలోనే పెళ్లి వివరాలను తెలియజేయనుంది.