English | Telugu

దేవీ ప్రసాద్ దర్శకత్వంలో వెంకటేష్

దేవీ ప్రసాద్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఒక చిత్రంలో నటించబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తన శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, "ఆడుతూ పాడుతూ", "బ్లేడ్ బాబ్జి" వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ దర్శకుడు దేవీ ప్రసాద్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరుపడ్డ దేవీ ప్రసాద్ తొలిసారిగా విక్టరీ వెంకటేష్ వంటి ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తున్నారు. దేవీ ప్రసాద్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈ చిత్రం హీరో విక్టరీ వెంకటేష్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉంటుందట. అలాగే దర్శకుడు దేవీ ప్రసాద్ స్టైల్లో పూర్తి హాస్యరస భరితంగా ఉంటుందని సినీ వర్గాలంటున్నాయి.

ఈ చిత్రం కథ గురించి ఇంకా ఏ విషయం తెలియక పోయినా, దేవీ ప్రసాద్ చెప్పిన కథ హీరో వెంకటేష్ కి బాగా నచ్చిందని తెలిసింది. గతంలో ఇదే బ్యానర్ లో వెంకటేష్ నటించిన "నాగవల్లి" ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కనుక దేవీ ప్రసాద్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించే ఈ చిత్రం డెఫినెట్ హిట్టవుతుందని సినీ పండితుల అంచనా.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం