English | Telugu

మహేష్ బాబు కోసం ప్రస్థానం దర్శకుడు.. ఏం ప్లాన్ చేశారు..?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కలయికలో ఒక భారీ ప్రాజెక్ట్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్ తో యాక్షన్ అడ్వెంచర్ గా దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతోంది. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

రాజమౌళి సినిమాలలో డైలాగ్ లు తక్కువే ఉన్నప్పటికీ, అవి బలంగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటాయి. డైలాగ్ రైటర్ ఎవరైనా కానీ, రాజమౌళి సినిమాల విషయంలో జరిగేది ఇదే. అలాంటిది ఇప్పుడు మహేష్ సినిమా కోసం ప్రముఖ దర్శకుడు దేవా కట్టాను రాజమౌళిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. బాహుబలి ఫ్రాంచైజ్ కి అజయ్-విజయ్ మాటల రచయితలుగా వ్యవహరించగా.. కొన్ని కీలక సన్నివేశాలకు దేవ కట్టా కూడా డైలాగ్స్ అందించారు. ఇక ఇప్పుడు 'SSMB29' కి పూర్తిస్థాయి డైలాగ్ రైటర్ గా దేవ కట్టాను తీసుకున్నట్లు సమాచారం.

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో దేవ కట్టా ఒకరు. ఆయన సినిమాలలోని మాటలు లోతైన భావాన్ని కలిగి, బలంగా ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటాయి. ముఖ్యంగా ప్రస్థానం, రిపబ్లిక్ సినిమాలలోని మాటల గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. అందుకే రాజమౌళి.. దేవను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బాహుబలి సమయంలో ఆయన టాలెంట్ దగ్గరుండి చూశారు. పైగా ఆయనకు ఇంగ్లీష్ మీద గ్రిప్ కూడా ఉంది. 'SSMB29'ని గ్లోబల్ ఫిల్మ్ గా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి.. కేవలం తెలుగు డైలాగ్స్ కోసమే కాకుండా, ఇంగ్లీష్ డైలాగ్స్ కి కూడా దేవ కట్టా టాలెంట్ హెల్ప్ అవుతుందని రాజమౌళి ఆయనను తీసుకున్నట్లు వినికిడి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.