English | Telugu

హిట్-3 ఫస్ట్ రివ్యూ.. నాని ఇలా చేశాడేంటి..?

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శైలేశ్ కొల‌ను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'హిట్-3' (Hit 3). 'హిట్' ప్రాంఛైజ్ నుంచి వస్తున్న మూడో చిత్రమిది. మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చిత్ర విడుదలకు దాదాపు మూడు వారాల ముందే సెన్సార్ పూర్తి కావడం విశేషం.

ఇటీవల 'హిట్-3' సెన్సార్ పూర్తయింది. ఫైనల్ రన్ టైంని 2 గంటల 35 నిమిషాలకు లాక్ చేశారు. ఇక ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. దానికి కారణం చిత్రంలో విపరీతమైన వయలెన్స్ ఉండటమే.

నానికి ఫ్యామిలీ స్టార్ లాంటి ఇమేజ్ ఉంది. అలాంటి నాని, ఇటీవల మాస్ బాట పట్టాడు. ఇక ఇప్పుడు 'హిట్-3'తో పూర్తి వయలెంట్ గా మారిపోయాడు. టీజర్ చూసినప్పుడే ఈ విషయం అర్థమైంది. ఇక తాజా సెన్సార్ టాక్ తో.. వయలెన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ ఉందని క్లారిటీ వచ్చేసింది.

'హిట్-3' సినిమా బాగుందట. కానీ, స్క్రీన్ ని ఎరుపెక్కించేలా చాలా వయలెంట్ గా ఉందట. అందుకే కొన్ని షాట్స్ ని బ్లర్ చేస్తూ, ఎ సర్టిఫికెట్ ఇచ్చిందట సెన్సార్. బ్లర్ చేస్తేనే ఎ సర్టిఫికెట్ అంటే.. చేయకపోతే రక్తపాతం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతుంటారు. కానీ, ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యే అవకాశముంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.