English | Telugu

వరల్డ్ రికార్డు సృష్టించిన దీపికా పదుకునే.. పాండ్యా, రొనాల్డో రికార్డు బద్దలు 

భారతీయ సినీప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'దీపికా పదుకునే'(Deepika padukone). బాలీవుడ్ లో దాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించి తనకంటు ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న 'దీపికా' గత ఏడాది ప్రభాస్, నాగ్ అశ్విన్ ల కల్కి 2898 ఏడి' తో తన సత్తా చాటింది.ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో చేస్తుంది. దీపికా క్యారక్టర్ కి సంబంధించి, మేకర్స్ రిలీజ్ చేసిన వీడియోతో, దీపికా ఒక శక్తీ వంతమైన పాత్రలో కనిపించబోతున్న విషయం అర్ధమవుతుంది.

కొన్ని రోజుల క్రితం ఒక అంతర్జాతీయ హోటల్ చైన్ తో కలిసి ‘ఇట్ మ్యాటర్స్ వేర్ యు స్టే'(It Maaters where you stay)ప్రచారంలో భాగంగా ఒక రీల్ ని దీపికా 'ఇన్ స్టాగ్రామ్'(Instagram)లో పోస్ట్ చేసింది. ఎనిమిది వారాల క్రితం చేసిన ఆ రీల్ ఇప్పటి వరకు 190 కోట్ల వ్యూస్ ని రాబట్టింది. దీంతో ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తరుపున ఉన్న అత్యధిక వ్యూస్ రికార్డుని దీపికా అధిగమించి,ప్రపంచంలోనే అత్యధికంగా చూసిన రీల్ గా రికార్డు సృష్టించింది. దీపికాకి ఇన్ స్టాగ్రామ్ లో 80 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

దీపికా ఇటీవల హాలీవుడ్ కి చెందిన 'వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటిగా నిలిచిన విషయం తెలిసిందే. 2006 లో ఉపేంద్ర హీరోగా కన్నడంలో తెరకెక్కిన ఐశ్వర్య మూవీతో దీపికా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 2007 లో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్(Shah Rukh Khan)తో కలిసి చేసిన 'ఓం శాంతి ఓం' తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.