English | Telugu

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం!

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా గుణి మంచికంటి దర్శకత్వంలో అతిరథ మహారధుల సమక్షములో కొత్త సినిమా ప్రారంభమైంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం నాడు ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆది శేషగిరి రావు ఘట్టమనేని, కేఎస్ రామారావు, డైరెక్టర్ పి. మహేష్ బాబు, కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి గోపాలకృష్ణ, బి గోపాల్, కోటగిరి వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సురేష్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముహూర్తపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ అక్కినేని స్క్రిప్ట్‌ను అందించగా.. ఆది శేషగిరి రావు క్లాప్ కొట్టారు. కేఎస్ రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. మహేష్ బాబు.పి గౌరవ దర్శకత్వం వహించారు.

నేపాల్ దేశ రాజవంశానికి చెందిన సమృద్ధి ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. స్టీఫెన్, ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా అజయ్ అబ్రహం జార్జ్, ఎడిటింగ్ గా విజయ్ ముక్తవరపు వ్యవహరిస్తున్నారు. కొండల్ జిన్నా సహ నిర్మాత. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.