English | Telugu
'దిక్కులు చూడకు రామయ్యా' రెడీ అయ్యాడు
Updated : Oct 8, 2014
నాగ శౌర్య, సనా జంటగా నటించిన చిత్రం 'దిక్కులు చూడకు రామయ్యా'. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇదో ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్ టైనర్. త్రికోఠి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ చిత్ర౦లో అజయ్, ఇంద్రజ కీలక పాత్రలో నటించారు.సాయి కొర్రపాటి నిర్మాత.