English | Telugu
పెద్ద దిక్కును కోల్పోయిన టాలీవుడ్..దాసరి కన్నుమూత
Updated : May 30, 2017
తెలుగు చిత్ర సీమకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ప్రముఖ దర్శకులు, దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో కిమ్స్‌లో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మూత్ర పిండాలలో సమస్య తలెత్తండంతో ఆయనకు ప్రస్తుతం హిమో డయాలసిస్ చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో దాసరి కన్నుమూశారు. వారం రోజుల కిందట కిమ్స్‌లో చేరిన దాసరి ఆరోగ్యం కొంతవరకు విషమించినట్లు తొలుత కథనాలు వచ్చాయి. ఆయన కోలుకుంటున్నారని..త్వరలో ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు ఆకాంక్షించారు. కానీ అందరి ఆశలను తలక్రిందులు చేస్తూ దాసరి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో టాలీవుడ్ కన్నీరుమున్నీరవుతోంది.