English | Telugu
'కొరియర్' కత్తిరించినా... కనికరించలేదు
Updated : Sep 18, 2015
వాయిదాల పర్వం దాటుకొని కొరియర్ బోయ్ కల్యాణ్.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ మూటగట్టుకొంది. ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచీ ఎలాంటి అంచనాలూ లేవు. కాబట్టి రిజల్ట్ కూడా షాకింగ్ అనిపించలేదెవ్వరికీ. అసలే రెండుగంటల సినిమా ఇది. అయినా సరే.. గౌతమ్ మీనన్ చివరి క్షణాల్లో 15 నిమిషాల సినిమాని ట్రిమ్ చేశాడట. దాంతో గంట 45 నిమిషాల సినిమాగా మారింది. ఇంత కత్తిరించినా ప్రేక్షకులు మాత్రం కనికరించలేదు. చివరి క్షణాల్లో ట్రిమ్ చేసినా, సినిమా ఇంకా లెంగ్తీగా, బోరీంగ్‌గా తయారైందంటే.. దర్శకుడి స్ర్కీన్ ప్లే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొరియర్ బోయ్‌తో వరుస హిట్లతో జోరుమీదున్న నితిన్ కి స్పీడ్ బ్రేకర్లు ఎదురైనట్టుంది పరిస్థితి. వాయిదాలు పడుతూ విడుదలైన ఏ సినిమా హిట్ అయినట్టు తెలుగు సినిమా చరిత్రలోనే లేదు. ఆ సెంటిమెంట్ ని కొరియర్ బోయ్ కూడా కంటిన్యూ చేసింది. !