English | Telugu
టెంపర్ లో కామెడీ కలుపుతారట!
Updated : Feb 24, 2015
పూరి - ఎన్టీఆర్‌లు కలసి ఆంధ్రావాలా ఫ్లాప్ కి బదులు తీర్చుకొన్నారు. కథపై దృష్టి పెడితే.. ఎలాంటి పలితం వస్తుందో వీళ్లకు అర్థమైంది టెంపర్‌తోనే. సినిమా అంతా బాగానే ఉంది గానీ.. పూరి సినిమాల్లో ఉండే వినోదం పాళ్లు తగ్గాయి అని ప్రేక్షకులు భావిస్తున్నారట. ఈ విషయం పూరి దృష్టికీ వెళ్లింది. అందుకే... ఇప్పుడు కొత్తగా కొన్ని సీన్లు యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కథకి అడ్డంగా ఉన్నాయని..ట్రిమ్మింగ్‌లో భాగంగా అలీ - సప్తగిరి మధ్య తీసిన కొన్ని సీన్స్ లేపేశారు. ఇప్పుడు వాటిని మళ్లీ యాడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సీన్స్ సెకండాఫ్‌లో కలుపుతారట. దాంతో సీరియస్ నెస్ నుంచి కాస్త రిలీఫ్ వస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ సీన్స్ యాడ్ అవుతున్నాయి. మరి ఈ సీన్స్ వల్ల వసూళ్లలో ఎంత మార్పు వస్తుందో చూడాలి.