English | Telugu

హాస్యనటుడు కొండవలస ఇక లేరు

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటులలో ఒకరైన కొండవలస ఈరోజు హఠాన్మరణం చెందారు. అనారోగ్యంతో హైద్రాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కొండవలస పూర్తి పేరు కొండవలస లక్ష్మణరావు. ఆగస్టు 10 1946వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామంలో లక్ష్మణరావు జన్మించారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' కొండవలస లక్ష్మణరావుకి తొలి సినిమా. తక్కువ కాలంలోనే వేగంగా అవకాశాలు దక్కించుకున్న కొండవలస, ప్రముఖ కమెడియన్ గా వెలుగొందారు.సినిమాల్లోకి రాకముందు విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌లో క్లర్క్‌గా ఉద్యోగం చేశారు. ఉద్యోగాల్లో చేస్తూనే నాటకాల్లో నటించారు. నాటక రంగంలోనూ అనేక అవార్డుల్ని కొండవలస సొంతం చేసుకున్నారు. దాదాపు 300 సినిమాల్లో నటించారాయన. ఓ గొప్ప నటుడిని పరిశ్రమ కోల్పోయింది. కొండవలస కుటుంబానికి తెలుగువన్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.