English | Telugu

క‌మ‌ల్‌హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌స్తుతం అవార్డుల వాప‌స్ కార్య‌క్ర‌మం తీవ్రంగా సాగుతోంది. క‌ళాకారులు, రాజ‌కీయ‌వేత్త‌లు, ర‌చ‌యిత‌లు త‌మ‌కొచ్చిన అవార్డుల్ని ప్ర‌భుత్వానికి తిరిగిచ్చేస్తూ.. త‌మ నిర‌స‌న‌ని తెలియ‌చేస్తున్నారు. దీనిపై క‌మ‌ల్ హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ''అవార్డులు తిరిగి ఇచ్చేయ‌డం తేలికైన విష‌య‌మే. క్యాష్ ప్రైజ్ లు ఇవ్వ‌రెందుకు?'' అని సెటైర్లు వేస్తున్నాడు. ''ప్ర‌భుత్వం ప్రేమ‌తో ఇచ్చిన అవార్డులు అవి. ప్ర‌తిభావంతుల‌కు ఆ రూపంలో స‌త్క‌రించుకొంది ప్ర‌భుత్వం. వాటిని వెన‌క్కి తిరిగిచ్చేయ‌డం భావ్యం కాద‌ని నా అభిప్రాయం'' అంటూ క్లియ‌ర్ క‌ట్‌గా చెప్పేశాడు.

అంతే కాదు.. ''ప‌రిశ్ర‌మ‌పై నిర‌స‌న తెలియజేయాలంటే వ‌చ్చిన అవార్డుల్నే కాదు. ఇక్క‌డ సంపాదించుకొన్న ఆస్తుల్నీ తిరిగి ఇచ్చేయాలి. అది క‌ష్టం క‌దా..'' అంటూ మ‌రో కౌంట‌రేశాడు. అంటే అవార్డుల్ని తిరిగి ఇచ్చేయ‌డంపై క‌మ‌ల్‌కి అంత‌గా ఆసక్తి లేద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి లెక్క‌లేనన్ని అవార్డులు అందుకొన్న క‌మ‌ల్ హాస‌నే ఇలా స్పందించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అయితే తాను ఏ పార్టీకి చెందిన‌వాడిని కాదంటూ, క‌ళాకారుడికి పార్టీ లేదంటూ.. త‌న‌పై నెగిటీవ్ ఇంప్రెష‌న్ ప‌డ‌కుండా జాగ్రత్త ప‌డుతున్నాడు క‌మ‌ల్. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌స్తాయో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.