English | Telugu

సమంత పవర్‌ఫుల్‌ ఫైట్స్‌తో ‘సిటాడెల్‌ హనీబన్నీ’.. నవంబర్‌ 7 నుంచి స్ట్రీమింగ్‌!

అమెరికాలో సిటాడెల్‌ టివి సిరీస్‌ ఎంతో పాపులర్‌ అయింది. ఇందులో రిచర్డ్‌ మ్యాడెన్‌, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రలు పోషించారు. యాక్షన్‌, సైన్స్‌ఫిక్షన్‌, థ్రిల్లర్‌.. ఇలా రకరకాల జోనర్స్‌లో సాగే ఎపిసోడ్స్‌ ఆడియన్స్‌ని ఎంతో థ్రిల్‌ చేస్తుంటాయి. సిటాడెల్‌లో ఇప్పటివరకు 6 ఎపిసోడ్స్‌ ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేశాయి. ఇప్పుడు సిటాడెల్‌ నవంబర్‌ 7 నుంచి ఇండియన్‌ ఆడియన్స్‌ని అలరించబోతోంది. ది ఫ్యామిలీ మ్యాన్‌, ఫర్జీ వంటి పాపులర్‌ వెబ్‌సిరీస్‌ని రూపొందించిన రాజ్‌ అండ్‌ డికె ఇండియన్‌ సిటాడెల్‌ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ‘హనీబన్నీ’ పేరుతో రూపొందిన ఎపిసోడ్‌లో వరుణ్‌ ధావన్‌, సమంత, కెకెమీనన్‌, సిమ్రాన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఫ్యామిలీ మ్యాన్‌ 2లో నెగెటివ్‌ రోల్‌ పోషించిన సమంత ఈ సినిమాలో యాక్షన్‌ హీరోయిన్‌గా కనిపిస్తుంది.

దీనికి సంబంధించిన టీజర్‌ గురువారం విడుదలైంది. అమితాబ్‌ బచ్చన్‌, శశికపూర్‌ హీరోలుగా నటించిన నమక్‌హలాల్‌ చిత్రంలో ‘రాత్‌ బాకీ.. బాత్‌ బాకీ..’ అంటూ సాగే సూపర్‌హిట్‌ సాంగ్‌ను రీమిక్స్‌ చేసి ఈ సినిమా కోసం ఉపయోగించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ సాంగ్‌ వస్తుండగా హనీ బన్నీ ఎపిసోడ్‌లోని యాక్షన్‌ సీక్వెన్స్‌లను చూపించారు. సమంత యాక్షన్‌ హీరోయిన్‌గా ఈ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకుంటుంది. ఎందుకంటే కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఎంతో రియలిస్టిక్‌గా చేసిందని టీజర్‌ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సిరీస్‌ కోసం సమంత మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకుందని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. 1990ల కాలంనాటి కథగా ఈ వెబ్‌సిరీస్‌ సాగుతుందని తెలుస్తోంది. ‘సిటాడెల్‌ హనీబన్నీ’ నవంబర్‌ 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుంది.