English | Telugu

2016 సంక్రాంతికి చిరు సినిమా??

చిరంజీవి సినిమాకి పూరి ద‌ర్శ‌కుడ‌య్యాని క‌న్‌ఫామ్ అయిపోయింది. ఈ విషయాన్ని రామ్‌చ‌ర‌ణ్ కూడా ధృవీక‌రించేశాడు. 'నాన్న‌గారి సినిమాకి జ‌గ‌న్ ద‌ర్శ‌కుడు.' అంటూ ట్వీట్ చేశాడు చ‌ర‌ణ్‌. దాంతో అభిమానుల ఆనందం రెండింత‌ల‌య్యింది. ఇప్పుడు... మ‌రో స్వీట్ న్యూస్‌. ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని పూరి భావిస్తున్నాడ‌ట‌. ఆగ‌స్టులో ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వుతుంది. సెప్టెంబ‌రులో సెట్స్‌పైకి తీసుకెళ్తారు. అక్టోబ‌రు, న‌వంబ‌రు.. రెండు నెలల్లో సినిమాని పూర్తి చేసి 2016 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని పూరి స్కెచ్ వేశాడ‌ట‌. పూరి టేకింగ్ య‌మ ఫాస్ట్ గా ఉంటుంది. స్టార్‌తో సినిమా అయినా ఆయ‌న చ‌క చ‌క పూర్తి చేస్తారు. చిరు సినిమాకీ ఇదే స్పీడు కంటిన్యూ చేయాల‌నుకొంటున్నాడ‌ట‌. కేవ‌లం 60 రోజుల్లో ఈ సినిమాని ఫినిష్ చేయాల‌న్న‌ది ధ్యేయంగా పెట్టుకొన్నాడ‌ట పూరి. అదే జ‌రిగితే.. బాక్సాఫీసు ద‌గ్గర అన్న‌ద‌మ్ముల వార్ చూసే అవ‌కాశం ఉంది. ఎందుకంటే గ‌బ్బ‌ర్ సింగ్ 2 సినిమాకీ సంక్రాంతికే ముహూర్తం ఫిక్స్ చేశారు. అటు ప‌వ‌న్ - ఇటు చిరు... 2016 మెగా హీరోలిద్ద‌రి సంద‌డి చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌. నిజంగా ఇది షాకింగ్ న్యూసే!!

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.