English | Telugu

చిరంజీవి ఇంట్లో మళ్ళి పెళ్లి బాజాలు

చిరంజీవి ఇంట్లో మళ్ళి మరోసారి పెళ్లి హడావుడి మొదలయ్యిందిట. అతని చిన్న కూతురు శ్రీజ నిశ్చితార్ధం గుట్టు చప్పుడు కాకుండా అతి కొద్దిమంది బంధువుల సమక్షం లో కానిచ్చారని , త్వరలోనే పెళ్లి కూడా చేస్తారని , అయతే అది గ్రాండ్ గానా ? లేక ఇలాగే రహస్యంగానా అన్నది మాత్రం అప్పుడే చెప్పలేమని ...వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే మొదటిసారి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవటమే కాకుండా , ఓ సినిమా కి తక్కువ కాకుండా బోల్డంత డ్రామా నడిపింది శ్రీజ..కుటుంబానికి దూరం కూడా అయ్యింది. ఇప్పుడు ఆ మొదటి పెళ్లి నుంచి బయటపడి ..ఆ పీడ కలని మర్చి పోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్ట బోతోందిట. ఈ సారి చిరంజీవి అల్లుడు S/O కన్నెగంటి కిషన్ అని తెలుస్తోంది. మరి ఈ సారి శ్రీజ జీవితాన్ని చక్కదిద్దాలి అని చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం సరియినదే అయ్యి, ఆ కళ్యాణ్ చేయి పట్టుకుని శ్రీజ హాయిగా వుంటుంది అని ఆశిస్తున్నారు వారి బంధువులు.మొత్తానికి చిరంజీవి అటు తన సినిమా, అటు కూతురు పెళ్ళితో ఈ ఇయర్ బిజీ, బిజీ గా వుండబోతున్నాడు అన్నమాట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.