English | Telugu

బూతు వైపే మొగ్గు

బాలీవుడ్ మూవీస్ లో ఇప్పుడు బూతు రాజ్యమేలుతోంది. ప్రతీ ఇండస్ట్రీలోనూ అడల్ట్ మూవీస్ కి ఫ్యాన్స్ ఉన్నప్పటికీ,బాలీవుడ్ ఇది కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. విషయమేంటంటే, సన్నీ లియోన్ ద్విపాత్రాభినయం చేసిన అడల్ట్ రేటెడ్ సినిమా ' మస్తీ జాదే ', మాధవన్ బాక్సింగ్ కోచ్ గా నటించిన ' సాలా ఖడూస్ ' రెండూ కూడా శుక్రవారం రిలీజయ్యాయి.

విచిత్రమేంటంటే, రెండింటిలోనూ సన్నీ సినిమాకే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్ లు జరిగాయి.ఓపెనింగ్స్ లో కూడా ఈ మూవీ అదరగొట్టింది. ఇండియా వైడ్ మస్తీజాదే కలెక్షన్ 6.5 కోట్లు కాగా, మాధవన్ సినిమా కేవలం 2.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది..కానీ మస్తీ జాదే పెద్దల స్థాయిని కూడా దాటేసిన సినిమా అని విమర్శలు వస్తున్నాయి..ఓపెనింగ్ కలెక్షన్స్ సన్నీ సినిమాకే ఎక్కువగానే ఉన్నా, లాంగ్ రన్ మాత్రం సాలా ఖడూస్ కే ఉంటుందనేది ట్రేడ్ వర్గాల అంచనా..

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.