English | Telugu

ఎయిర్ పోర్ట్ లో షాక్ తిన్న రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కబాలీ మూవీ షూటింగ్ మలేషియాలో జరుగుతోంది.దీనికోసం ఆయన చెన్నై నుంచి మలేషియా వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు..తీరా ఇమ్మిగ్రేషన్ కోసం వెళ్లిన తర్వాత గానీ, ఆయనకు పాస్ పోర్ట్ మర్చిపోయానని అర్ధం కాలేదు..దీంతో షాక్ తిన్న సూపర్ స్టార్ వెంటనే తేరుకుని తన పాస్ పోర్ట్ ను పంపించమని ఇంటికి ఫోన్ చేశారు.

ఓ పక్క ఫ్లైట్ వెళ్లిపోయే టైం దగ్గరపడుతోంది..పాస్ పోర్ట్ చేతికి అందుతుందో లేదోనని టెన్షన్ పడ్డ రజనీ, తన అసిస్టెంట్ హడావిడిగా పాస్ పోర్ట్ తీసుకురావడంతో, ఊపిరి పీల్చుకున్నారు .. తాను వెళ్లడం లేట్ అయితే షూటింగ్ వాయిదా పడుతుందని టెన్షన్ పడటం, రజినీ వ్యక్తిత్వానికి నిదర్శనం అంటున్నారు ఎయిర్ పోర్ట్ లో ఆయన్ను చూసిన వారు..మొత్తానికి, పాస్ పోర్ట్ మర్చిపోయినా, సమయానికి విమానాన్ని అందకోగలిగారు రజనీకాంత్.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.