English | Telugu

తమిళనాడు తొక్కిసలాట ఘటనపై చిరంజీవి రియాక్షన్!

తమిళనాడులోని కరూర్‌లో శనివారం కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట కారణంగా 39 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఘటనపై స్పందించారు. (TVK Vijay Rally Stampede)

చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ "తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట చాలా విషాదకరం. ఈ దుర్ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యం చేకూరాలని కోరుకుంటున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి." అని పేర్కొన్నారు. (Chiranjeevi)

కాగా, కరూర్‌ కి విజయ్ ఆలస్యంగా చేరుకోవడం, రావాల్సిన దానికంటే ఎక్కువమంది ర్యాలీకి హాజరవ్వడం వంటి కారణాలతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.