English | Telugu

హైకోర్టుకి చిరంజీవి.. అధికారులకు చుక్కలు..!

మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC)కి అక్షింతలు వేసింది. ఇంతకీ చిరంజీవి ఎందుకు హైకోర్టుకెక్కారు.. హైకోర్టు జీహెచ్ఎంసీకి ఎందుకు అక్షింతలు వేసింది అన్న వివరాలలోకి వెళ్తే.. చిరంజీవి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో రెన్నోవేషన్ పనులు చేపట్టారు. అందులో భాగంగా రిటైన్ వాల్ నిర్మించారు. ఇంటి పునరుద్ధరణలో భాగంగా తాను చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని చిరంజీవి జిహెచ్ఎంసి కి దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 5న చిరంజీవి జీహెచ్ఎంసీకి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకుంటే.. దానినై జీహెచ్ఎంసీ నుంచి ఎటువంటి స్పందనా లేదు. దీంతో చిరంజీవి జిహెచ్ఎంసి తీరుపై కోర్టుకెక్కారు.

చిరు తరఫున వాదించిన న్యాయవాది.. చిరంజీవి ఇంటికి సంబంధించి 2002లోనే జి+2 నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామనీ, ఇప్పుడు పునరుద్ధరణ పనులు మాత్రమే చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలంచి క్రమబద్ధికరించాలని జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది.. చిరంజీవి దరఖాస్తు అందిందనీ,చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ దరఖాస్తు పైన చట్ట ప్రకారం ఉత్తర్వులు ఇవ్వాలని జిహెచ్ఎంసి ని ఆదేశిస్తూ విచారణను ముగించారు.

ఈ సందర్భంగా జీహెచ్ఎంసీపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమ‌తులు ఇచ్చేందుకు ఎంత గ‌డువు కావాల‌ని ప్ర‌శ్నించింది. అక్ర‌మ నిర్మాణాల‌కు అధికారులు వత్తాసు ప‌లుకుతున్నార‌న్న ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్న కోర్టు.. స‌క్ర‌మ నిర్మాణాల‌కు అనుమ‌తులు ఇవ్వ‌లేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.